చండూరు యూత్ పోలింగ్ కేంద్రంలో

by Disha Web Desk 22 |
చండూరు యూత్ పోలింగ్ కేంద్రంలో
X

దిశ, చండూరు: చండూరు పురపాలికలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన 207, 210 యూత్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. మున్సిపాలిటీలో ఎక్కువ ఓట్లు ఉన్న రెండు పోలింగ్ బూత్ లను ఒకటే గదిలో ఏర్పాటు చేయడం వలన రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రెండు పోలింగ్ బూత్‌లోకి ఓకే ఇరుకైన గేట్ ద్వారా ఓటర్లను పంపడం వలన ప్రవేశ మార్గం రద్ది ఏర్పడి ఓటర్లు అవస్థలు పడుతున్నారు. పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసినప్పటికి ఎక్కువ మొత్తంలో భారీగా ఓటర్లు బారులు తీరారు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 3 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, మహిళలు అంత సమయం వేచి ఉండలేక నేలపై కూర్చోగా, మరికొందరు కుర్చీలు తెప్పిచ్చుకొని కూర్చున్నారు. తాగు నీరు లేక ఓటర్లు ఇబ్బందులకు గురికావటంతో నాయకులు వాటర్ బాటిల్స్ ను సప్లయ్ చేశారు. దీంతో అధికారుల తీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.Next Story