మధ్యాహ్న భోజనంపై కేంద్ర బృందం ఆరా

by Disha Web Desk 15 |
మధ్యాహ్న భోజనంపై కేంద్ర బృందం ఆరా
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : మధ్యాహ్న భోజనంపై కేంద్ర బృందం గురువారం పలు చోట్ల ఆరా తీసింది. గురువారం మిషన్ సభ్యులు బొమ్మలరామారం, తుర్కపల్లి, భువనగిరి మండలాల్లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న తీరు, కిచెన్ గార్డెన్ లను, పిల్లలకు అందించే మెను వివరాలను, విద్యార్థుల ఎత్తు, బరువు పరిశీలించారు. బియ్యం సరఫరా విధానాన్ని, కుకింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లల, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారు. మధ్యాహ్న భోజనం రుచిని పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ పట్ల సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం సరఫరా సకాలంలో జరుగుతున్నదాని, అలాగే బియ్యం నిలువ చేయడంలో తేమ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, వంట చేసేముందు బియ్యంలో పురుగు లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ సభ్యులు అందించిన సూచనలతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఇంకా పకడ్బందీగా చేపడతామన్నారు. బృందంలో న్యూఢిల్లీ చీఫ్ కన్సల్టెంట్ భూపేంద్ర కుమార్, రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ ఉన్నారు. వారి వెంట జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉన్నారు.


Next Story