- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ అరెస్ట్ అప్రజాస్వామికం..

దిశ, చండూరు : మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ అరెస్ట్ అప్రజాస్వామికమని మాదిగ సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఆర్ధిక లావాదేవీల విషయంలో ఒక వ్యక్తిపై దాడి చేశారనే కారణంతో మాజీ కౌన్సిలర్ దళిత నాయకుడు అన్నెపర్తి శేఖర్ ని అప్రజాస్వామికంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం.. అన్యాయమని మాదిగ సామాజిక వర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం మండలానికి చెందిన మాదిగ ముఖ్య నాయకుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ..జెడ్ పి టి సి సభ్యులుగా, మున్సిపల్ కౌన్సిలర్ గా సేవలందించిన మాజీ ప్రజాప్రతినిధిని ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి భయభ్రాంతులకు గురిచేసేలా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి, చట్ట వ్యతిరేకంగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తూ దళితులను, ఇతర పౌరులను అణచివేతకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని, అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ బద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. నిజంగా తప్పు చేసి ఉంటే విచారణ జరిపి, చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలే కానీ..రాజకీయ వ్యక్తిగత కక్షలతో తప్పుడు కేసులు బనాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, పార్టీలకతీతంగా దళిత సంఘాల ఐఖ్య వేదిక ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాదిగ సామాజిక వర్గ ముఖ్య నాయకులు కురుపాటి సుదర్శన్, ఇరిగి గురునాథం, ఇరిగి రామన్న, నలగంటి రమేష్, అన్నెపర్తి యాదగిరి, తీగల అశోక్, నారపాక అంజి, యేసు, ఇరిగి దుర్గా ప్రసాద్, కురుపాటి శంకర్, ఇరిగి శంకర్, ఎల్వర్తి జగన్, ఇరిగి రామకృష్ణ, తరి సురేష్, ఇరిగి కుమార్, తలారి వెంకటేశ్వర్లు, దుబ్బ గణేష్, బుషిపాక నగేష్, అన్నెపర్తి శ్రీకాంత్ బాధిత కుటుంబ సభ్యులు మాజీ జెడ్ పి టి సి అన్నెపర్తి సంతోష, రామస్వామి, కృష్ణయ్య, అన్నెపర్తి యాదయ్య, మామిడి అంజయ్య, గోసుకొండ దశరథ, తలారి కిరణ్, తలారి శివ, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.