పరిహారం అందుకునేందుకు దళిత రైతులకు అర్హత లేదా?

by Dishanational2 |
పరిహారం అందుకునేందుకు దళిత రైతులకు అర్హత లేదా?
X

దిశ ,నల్గొండ బ్యూరో: గ్రామాలలో సహజంగా దేవాలయాల్లోకి వెళ్లాలంటే దళితులకు అర్హత లేదని అంటుంటారు కానీ భూములు కోల్పోయిన రైతులకు కూడా పరిహారం అందుకోవడానికి అర్హత లేదని విషయం ఈ గ్రామంలో దళిత రైతుల భూమికి పరిహారం ఇవ్వకపోవడంతో అర్థమవుతుంది . కొన్నేళ్లుగా ఆ భూమిపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న దళిత రైతులకు సంబంధించిన భూమిని అభివృద్ధి పేరుతో బలవంతంగా లాక్కున్నారు కానీ ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారు పోలీస్ స్టేషన్లో పెట్టి ఒళ్ళు పూనకమయ్యేలా కొట్టిస్తున్నారు వీళ్లకు అండగా ఏ వర్గము లేదు ఏ రాజకీయ పార్టీ లేదు భూమి పోవడంతో ఉపాధి లేక కుటుంబాలు గడవక వాళ్లంతా రోడ్డున పడ్డారు.. ఎవరా రైతులు.. ఏంటి వాళ్ల వ్యథ.. కన్నీటి గాథ చూద్దాం పదండి..

పరిహారానికి దళితులకు అర్హత లేదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అత్యంత ప్రతిష్టత్మకంగా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఈ పవర్ ప్లాంట్ కోసం 2015 చివర నుంచి 2016 వరకు గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి పవర్ ప్లాంట్ కు భూములు ఇవ్వాలని అది ఏర్పాటు అయితే ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వం ప్రజాప్రతితులు రైతులను నమ్మించారు. వాళ్ళ మాటల మీద రైతాంగం ఉపాధి లభిస్తుందని కారణం చెప్పి మెజార్టీ రైతులు భూములు ఇచ్చారు కానీ కొంతమంది దళిత రైతులు భూములు సంస్థకు ఇస్తే తమ జీవనాధారం లేకుండా పోతుంది అని చెప్పి పవర్ ప్లాంట్ కు వ్యవసాయ భూమి ఇవ్వడానికి వాళ్లు నిరాకరించారు. అలా భూములు ఇవ్వమని చెప్పిన రైతుల నుంచి బెదిరించి భయపెట్టి బలవంతంగా ప్రభుత్వం భూములు లాక్కుంది . కానీ కొంతమంది రైతులు మాత్రం ఎన్ని ఇబ్బందులు గురి చేసిన భూమి ఇచ్చే ప్రసక్తే లేదని అని చెప్పి భూములు ఇవ్వలేదు అందులో భాగంగానే వీర్లపాలెం గ్రామానికి చెందిన సుమారు పది మంది దళిత రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడలే, కానీ వాళ్ల దగ్గర నుంచి కూడా బలవంతంగా లాక్కున్నారు . అయితే భూములు ఇచ్చిన వారందరికీ ఒక ఎకరానికి ఐదు లక్షల ఏడు వేల రూపాయలు చొప్పున పరిహారం అందజేశారు. కానీ దళితులు కావడం వల్లనే కేవలం 10మందికి చెందిన సుమారు 30 ఎకరాల భూమికి ఒక్క చిల్లి గవ్వ ఇంతవరకు పరిహారం అందలేదు . ప్లాంట్ యజమాని భూములు ఆక్రమించుకొని సుమారు 8 సంవత్సరాలు దాటింది.

రైతులపైనే కేసులు ..?

తాము సాగు చేసుకుని వచ్చిన పంటల పైనే ఆధారపడి జీవిస్తున్నందున తమ భూమి ఎట్టి పరిస్థితుల్లో పవర్ ప్లాంట్ ఇచ్చేది లేదని రైతులు గట్టిగా శాఖ అధికారులకు చెప్పారు. కానీ రైతు చెప్పిన వినకుండా వాళ్ళ వద్ద నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారు. అదే క్రమంలో 2019 నవంబర్లో బలవంతంగా తమ వ్యవసాయ భూములు లాక్కుంటున్నారని ఆవేదనతో దళిత అక్కడే ఉన్న ఒక పెద్ద మిషన్ కి తాడు వేసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారని సమాచారం . అక్కడే ఉన్న కొంతమంది ఆ రైతును రక్షించే ప్రయత్నం చేశారు . కానీ భూమిని ఆక్రమించుకుంటున్నందుకు అడ్డు వచ్చాడని కారణం చూపి కంపెనీ యజమాన్యం బచ్చలకూరి ఆంజనేయులుపై 2019 నవంబర్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు . అంతేకాకుండా రాజు అనే యువకుడిని రెండు రోజులపాటు పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిసింది.. మరి కొంతమంది మీద అత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రైతులు కోర్టులు , పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారు

న్యాయం కోసం దీక్షలు

పవర్ ప్లాంట్ కోసం భూములు తీసుకున్న అందరి రైతులకు పరిహారం అందించారు కేవలం దళిత రైతులకు మాత్రమే పరిహారం చెల్లి గవ్వ కూడా అందలేదు అధికార పార్టీ నేతలు , గ్రామంలో ఉన్న కొంతమంది ఉన్నత వర్గాల చెందిన నాయకులు తమకు పరిహారం దక్కకుండా చేశారని ఎట్టి పరిస్థితుల్లో తాము కోల్పోయిన భూములకు ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా వీర్లపాలెం గ్రామానికి చెందిన 10మంది దళిత రైతులు నల్లగొండ కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి బహుజన సమాజ్ పార్టీ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి

పరిహారం అందేవరకు కదలం..

పవర్ ప్లాంట్ కోసం భూమి ఇచ్చిన రైతులకు మొదటి రెండు దఫాల్లో నష్టపరిహారం అందించారు ఆ రెండు జాబితాలో కేవలం దళితులకు సంబంధించిన రైతుల పేర్లు మాత్రమే లేవు అంటే స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కలిసి తమపై చేసిన కుట్రలో భాగం ఇది ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన పరిహారం అందే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు.

బచ్చలకూరి అంజనేయులు వీర్లపాలెం ,రైతు


రైతుల పోరాటానికి అండగా ఉంటాం

యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందించి కేవలం దళితులకు మాత్రమే ఇవ్వకపోవడం కుట్రపూరితమే . ఇందులో కూడా కులం పేరుతో చిన్నచూపు చూడడం సహించరానిది . వీర్లపాలెం దళిత రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటానికి అండగా ఉంటాం.

కోదండరాం, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు

Next Story

Most Viewed