భారత అగ్నిపత్ సంగీతకారుడు నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం

by Kalyani |
భారత అగ్నిపత్ సంగీతకారుడు నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ,నల్గొండ: కాన్పూర్,బెంగళూరులలో భారత వాయు సైన్యం అఖిల భారత అగ్ని వీర్యాయు సంగీతకారుడు నియామకానికి నిర్వహించనున్న నియామక ర్యాలీకి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 నుంచి జూన్ 5 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్ .పద్మ తెలిపారు. అభ్యర్థులు http://agnipathvayu.cdac.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. జనవరి 2,2004 మరియు జులై 2,2007 మధ్య జన్మించి (రెండు తేదీలు కలుపుకొని) అర్హత ఉన్న అవివాహిత పురుష,స్త్రీ అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. తాత్కాలికంగా అడ్మిట్ కార్డు జారీ చేసిన నమోదిత అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతించబడతారని ఆమె తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీ, సమయం తాత్కాలిక అడ్మిట్ కార్డ్ లో పేర్కొనడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.



Next Story

Most Viewed