సాగర్ డ్యాం పై ప్రమాదం.. సిబ్బందికి తీవ్ర గాయం ఆస్పత్రికి తరలింపు

by Dishafeatures2 |
సాగర్ డ్యాం పై ప్రమాదం.. సిబ్బందికి తీవ్ర గాయం ఆస్పత్రికి తరలింపు
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యాంపై మంగళవారం రాత్రి జరిగిన సాంకేతిక పరమైన ప్రమాదంలో సాగర్ డ్యాం సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక కమలా నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అధికారులు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మతుల్లా అనే వ్యక్తి నాగార్జునసాగర్ డ్యాంపై గేట్ల విభాగంలో గేట్స్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

విధి నిర్వహణలో భాగంగా డ్యాం పైభాగాన గేట్స్ ఆపరేట్ చేసే విభాగంలో గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని తగ్గించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో 26వ క్రస్ట్ గేట్‌కు సంబంధించిన మోటార్ ఫ్యాన్ రెక్కలు విరిగి పోయి తన కుడి కాలికి తగిలింది. దాంతో అతడి కాలుకు 70 శాతం వరకు తీవ్ర గాయమైంది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజ్మతుల్లాను వెంటనే అధికారులు సిబ్బంది కలిసి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సాగర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం క్రాస్ట్ గేట్ మోటార్ ఫ్యాన్ నుండి విరిగిపోయిన ఫ్యాన్ రెక్క ముక్క మోకాలి కింది భాగంలోనే ఉండిపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గాయపడిన సిబ్బందిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అనుకోకుండా సాంకేతికపరమైన కారణాలతో జరిగిన దుర్ఘటన అని, గాయపడిన అజ్మతుల్లాకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.


Next Story

Most Viewed