పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే..: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

by Aamani |
పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే..: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
X

దిశ, సూర్యాపేట : నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం యూనిట్ గా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేయడం పట్ల ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అంటున్నారన్నారు. గ్రామ సభలు అన్నీ ఒక ప్రహసనంగా మార్చారని రెండు సార్లు దరఖాస్తు తీసుకుని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు ఎందుకన్నారు. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, గ్రామ సభలన్నీ ప్రజల నిరసనలతో మార్మోగిపోతున్నాయని గుర్తుచేశారు. మండలానికో గ్రామం, మార్చి 31 అంటూ ఇంకా ప్రజలని మభ్య పెడుతున్నారన్నారు.

డిసెంబర్ 9 అని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి ఒక గ్రామంతో మొదలుపెట్టారని రాష్ట్రమంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. హామీల అమలులో విఫలం అవుతున్నారని,ఒక్కొక్కటిగా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ , నీళ్ళు ఇవ్వలేక గప్పాలు కొడుతున్నారన్నారు. ఇందిరమ్మ బొమ్మ పెడితే పథకాలకు పైసలీయమని హామీలు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్ , బీజేపీ లు డ్రామాలాడుతున్నారన్నారు. ఒకరు రాష్ట్రానికి టోకరా వేస్తే మరొకరు దేశానికి వేస్తున్నారన్నారు. ప్రజలను మోసం చేస్తూ ప్రజల కోసం కొట్లాడుతున్న బీ ఆర్ ఎస్ పై కక్ష కడుతున్నారన్నారని కాంగ్రెస్ , బీజేపీ ఇద్దరు తెలంగాణ ద్రోహులే నన్నారు. కాంగ్రెస్ , బీజేపీ ల నైజం ప్రజలకు అర్ధమై తిరుగుబాటుకు సిద్ధమైతున్నారన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల వ్యతిరేకత మొదలైందని కాంగ్రెస్ , బీజేపీలకు రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం నాటి చుక్కలే చూపిస్తారన్నారు.

ప్రతిపక్షంగా ఇంకా మేము పిలుపు ఇవ్వక ముందే ప్రజలు తిరగబడుతున్నారని ప్రజల ఉద్యమానికి బీ ఆర్ ఎస్ నాయకత్వం వహిస్తుందన్నారు. ఇచ్చిన హామీలు డిసెంబర్ 9 సోనియా జన్మదినం అని చెప్పి రెండు బర్త్డే లు పోయాక ఇప్పుడు ఒక్క గ్రామం అంటున్నారని ఏద్దేవా చేశారు. మార్చ్ 31 తరవాత అయినా పూర్తి స్థాయి పథకాల అమలు అనుమానంగానే కనిపిస్తుందని ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ కి చేతకావడం లేదన్నారు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్ కి సమయం సరిపోవడం లేదు ఇక పాలన ఏం చేస్తారని మండిపడ్డారు.



Next Story

Most Viewed