సీజ్ చేసిన అన్ని వాహనాలు వేలంపాటలో అమ్మకం

by Kalyani |
సీజ్ చేసిన అన్ని వాహనాలు వేలంపాటలో అమ్మకం
X

దిశ,హుజూర్ నగర్ : హుజూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి సీజ్ చేసిన 14 వాహనాలను ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి ఆర్ . లక్ష్సా నాయక్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించినట్లు హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. హుజూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ నందు ఉదయం 10 గంటలకు వేలంపాట ప్రారంభించామని తెలిపారు.ఈ వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన 82వేల ధరకే గాను 374 శాతం అధికంగా 3,07,390 రూపాయలకు అన్ని వాహనాలను వేలంలో పాల్గొని పలువురు ఆ వాహనాలను కొనుగోలు చేశారని తెలిపారు.

Next Story

Most Viewed