కల్తీ పాలు తయారీదారుడు అరెస్ట్. .

by Disha web |
కల్తీ పాలు తయారీదారుడు అరెస్ట్.    .
X

దిశ, భూదాన్ పోచంపల్లి: కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన భూదాన్ పోచంపల్లి పురపాలక పరిధిలోని ముక్తాపూర్ లో మంగళవారం చోటు చేసుకుంది. ముక్తాపూర్ కు చెందిన సన్న రాజేష్ గ్రామం చుట్టుపక్కన ప్రాంతాల్లో పాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం తన ఇంట్లో కృత్రిమంగా కల్తీపాలను తయారు చేస్తుండగా ఎస్ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి అరెస్టు చేశారు. అతని వద్ద 200 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ ప్లోరాక్సైడ్ 6 లీటర్లు, 6 కేజీల మిల్క్ పౌడర్ ని పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక ఎస్ఐ సైదిరెడ్డికి అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకొని ఎస్ఐ తయారీదారుడిని అరెస్టు చేసి కల్తీ చేసిన పాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు.Next Story