ఉర్సులో అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు : ఎమ్మెల్యే సైదిరెడ్డి

by Disha Web Desk 15 |
ఉర్సులో అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు : ఎమ్మెల్యే సైదిరెడ్డి
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : ఉర్సు కోసం జన్​పహాడ్​ దర్గాకు వచ్చే భక్తుల నుండి అధిక వసూళ్లకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వక్ఫ్ బోర్డ్ ఇన్స్‌పెక్టర్ షేక్. మహబూబ్, పాలకవీడు ఎస్సై సైదులు గౌడ్ ను ఆదేశించారు. బుధవారం జాన్ పహాడ్ దర్గాను దర్శించి లోపల దాతలైన జిల్లా రైతబంధు కమిటీ సభ్యులు మలమంటి దర్గారావు, స్థానిక పెట్రోల్ బాంక్ యాజమాన్యంలు అందచేసిన 4 ఏసీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దర్గాకు మెుక్కులు చెల్లించుకునేందుకు , కందూరు నిర్వహించేందుకు వచ్చే భక్తుల నుండి కొంతమంది దోపిడీదారులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాలని సూచించారు.

అటువంటి వారిని గుర్తించి అవసరమైతే ముందస్తు అరెస్టు చేయాలని అన్నారు. అలాగే దర్గా ఆవరణలో ధర నియంత్రణ ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే దర్గా అభివృద్ధికి రూ. 50 లక్షలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని ఏ విధంగా ఖర్చు చేయాలో అధికారులు గుర్తించాలని కోరారు. అనంతరం ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి, జిల్లా రైతు బంధు కమిటీ సభ్యులు మలమంటి దర్గారావు, పీఎసీఎస్ చైర్మెన్ యరెడ్ల సత్యనారాయణరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భూక్యా రవినాయక్, ముజావర్ జాని పాల్గొన్నారు.


Next Story

Most Viewed