ఆ గ్రామ పంచాయతీ సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలి !

by Disha Web Desk 20 |
ఆ గ్రామ పంచాయతీ సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలి !
X

దిశ, దేవరకొండ : కొండ భీమనపల్లి గ్రామ సెక్రెటరీ విధి నిర్వహణలో ప్రజలకు అందుబాటులో లేక పలుమార్లు ఫోన్లు చేసిన మాట్లాడక పోవడం, గ్రామ పంచాయతీకి సరైన సమయంలో రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎర్ర ఆంజనేయులు అన్నారు. శనివారం మండల ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఎండీ లతీఫ్ కు ఆయన సెక్రటరీ పై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయించకుండా గ్రామంలో పారిశుద్ధ్య పనులు మురికి కాల్వలు, రోడ్ల వెంట పెరిగిన కంప చెట్లను తొలగించడంలో, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు శుభ్రం చేయడంలో వాటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లడంలో అశ్రద్ధ వహిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలో ప్రజలకు కావలసిన సర్టిఫికెట్స్, గ్రామ అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి ఎవరు వెళ్లిన ఎప్పుడు కార్యాలయానికి తాళం వేసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కావున గ్రామ సెక్రటరీ పై తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఎంపీడీవోను కోరారు.



Next Story

Most Viewed