- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
by Kalyani |

X
దిశ , మేళ్లచెరువు : సూర్యపేట్ జిల్లా, మేళ్లచెరువు మండలం కేంద్రం లో హత్య ప్రయత్నం చేసిన కేసులో నిందితుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పరమేష్ తెలిపారు. ఆదివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 19న సాయంత్రం చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన షేక్ షంసీర్ S/o మౌలాలి అను అతను మేళ్లచెరువు గ్రామంలో శివాలయం గుడి దగ్గరలోని A-1 పంచర్ షాప్ వద్ద కూర్చొని ఉండగా, మేళ్లచెర్వు గ్రామానికి చెందిన గోపి శంకర్ భూమి తగాదాలు, తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో షంసీర్ ను ఎలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో గొడ్డలితో దాడి చేసి అతనిని గాయపరిచినట్లు పోలీసు విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో గోపిశెట్టి శంకర్ ను, సి ఆర్ పి నెంబర్ 52/2024, యూ/ఎస్ 307 ఆర్/డబ్ల్యు 34 ఐపిసి ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Next Story