అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల స్వీకరణ

by Naveena |
అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, నిడమనూరు: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్ట్ కు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధికారి పద్మారాణి తెలిపారు. ఇంగ్లీష్ సిఆర్టి పోస్ట్ ను మెరిట్ ఆధారంగా నియమించబడుతారని తెలిపారు. డిగ్రీ బిఈడి విద్యా అర్హత కలిగి ఉండాలని,ఎంపికైన వారు ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు రెండు రోజులలో కేజీబీవీ నిడమనూర్ పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని ఎస్ ఓ తెలిపారు.



Next Story

Most Viewed