- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాలికల హాస్టల్‌పై ఏసీబీ దాడులు.. సక్రమంగా లేని రికార్డులు

దిశ,తుంగతుర్తి: వసతి గృహంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించమని ఏసీబీ నల్లగొండ డీఎస్పీ జగదీష్ చందర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంపై మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు చేసిన దాడుల తనిఖీల్లో గ్రహించిన వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.లీగల్ మెట్రాలజీ,సానిటరీ,ఫుడ్ ఇన్స్ పెక్టర్ చిట్టిబాబు,నాగరాజు,స్వాతి,ఆడిటర్ ప్రణయ్ లు దాడుల్లో పాల్గొన్నారని తెలిపారు.గత కొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో అవకతవకలు జరుగుతున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు.ఇందులో భాగంగానే తమకు అందిన సమాచారం మేరకు తుంగతుర్తి వసంతి గృహంపై దాడులు చేపట్టామని తెలిపారు.
కొన్ని రికార్డులు సక్రమంగా లేకపోగా ఉన్న రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు.వసతి గృహంలో 51 మంది బాలికలు ఉన్నట్లగా రికార్డుల్లో నమోదైతే తమ తనిఖీల్లో మాత్రం 25 మంది ఉన్నారని తెలిపారు.పక్కనే స్మశాన వాటిక ఉన్నందువల్ల విద్యార్థినిలు సాయంత్రం వేళల్లో తమ తమ ఇండ్లలకు వెళ్ళిపోతున్నారని తెలిపారు.వాస్తవానికి వసతి గృహ సంక్షేమ అధికారి మార్తమ్మ తో పాటు సిబ్బంది,విద్యార్థినులు అంతా వసతి గృహంలోనే ఉండాలని తెలిపారు.కాగా వసతి గృహానికి వచ్చిన బడ్జెట్-ఖర్చులపై ఆడిటర్,లెట్రిన్- బాత్రూం-పరిసరాల వాటిపై సానిటరీ,సరుకుల స్టోరేజ్- కుకింగ్ పై-గదులు,తదితర వాటిపై ఫుడ్ అధికారులు తనిఖీలు చేసి రిపోర్టు ఇచ్చారని తెలిపారు.
స్టోర్ రూమ్ లో గాలి,వెలుతురు లేకపోవడం వల్ల సరుకులకు పురుగు పట్టిందని ఇది పాయిజన్ గా మారే ప్రమాదం ఉందని తెలిపారు.విద్యార్థులకు బెడ్స్ సక్రమంగా లేవని అన్నారు. అడిగిన సమాచారం పై వసతి గృహ సంక్షేమ అధికారి మార్తమ్మ సమాధానం ఇవ్వలేదని తెలిపారు.కాగా వసతి గృహంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ అధికారులకు నివేదికల ద్వారా వివరిస్తామని తెలిపారు.అంతేకాకుండా వసతి గృహ సంక్షేమ అధికారి మార్తమ్మపై చర్యలకు గాను నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన పనులకు లంచాలు అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ 1064, ట్విట్టర్,ఎక్స్,ఫేస్ బుక్ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు.సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వివరించారు.
ఉలిక్కిపడ్డ తుంగతుర్తి..
ఇటీవలే నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల పోలీస్ స్టేషన్ పై జరిగిన ఏసీబీ దాడుల సంగతి మర్చిపోకముందే తుంగతుర్తిలో మంగళవారం జరిగిన సంఘటన అందరిని ఉలిక్కి పాటుకు గురిచేసింది.ఎస్సీ బాలికల ప్రసతిగృహంపై ఏసీబీతో పాటు వివిధ శాఖల అధికారులు అకస్మాత్తుగా దాడులు చేసిన విషయం నియోజకవర్గ వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది.వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,తదితరులంతా అసలు ఏం జరుగుతోంది..? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అక్కడ ఏం జరుగుతోంది...? ఎవరెవరు వచ్చారు..? ఎందుకు వచ్చారు...? అనే ప్రశ్నలపై అందరిలో చర్చ కొనసాగింది. ముఖ్యంగా ఉదయం 6 గంటలకే ఏసీబీ, తదితర శాఖల అధికారులు వసతి గృహానికి చేరుకోగా దానికి తాళం వేసినట్లు గుర్తించారు. అధికారులే సమాచారం ఇస్తూ వారిని పిలిపించారు.