సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు

by Aamani |
సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు
X

దిశ, గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం సహకార సంఘం పాలకవర్గాన్ని రద్దుచేస్తూ జిల్లా సహకార సంఘం అధికారి పద్మజ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంఘంలో మెజారిటీ సభ్యులు(7గురు) రాజీనామాలు చేయడంతో ఈనెల 6న జరగవలసిన సమావేశాన్ని అధికారులు నిలిపివేశారు. అనంతరం సభ్యుల రాజీనామాలను ఆమోదించి పాలకవర్గాన్ని రద్దు చేసినట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు.

సర్వారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యకలాపాలను నిర్వహించడానికి టిసిఎస్ చట్టం 1964 రూల్ 23 ఏ ఏ ఏ (5) ప్రకారం ఆరు నెలల పాటు పర్సన్ ఇన్చార్జి కమిటీని నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సహకార సంఘం పాలకవర్గ రద్దు కావడంతో పర్సన్ ఇన్చార్జి కమిటీ లో అసిస్టెంట్ రిజిస్టర్ జి కమల, నేరేడుచర్ల సహకార బ్యాంకు మేనేజర్ సతీష్ లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed