గ్రామంలో అడవి దున్న సంచారం..

by Sumithra |
గ్రామంలో అడవి దున్న సంచారం..
X

దిశ, చౌటుప్పల్ : గ్రామంలో అడవిదున్న సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామ శివారులో గురువారం అడవిదున్న సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఆత్మకూర్ (ఎం)మండలం పల్లెర్ల గ్రామంలో అడవి దున్న సంచరించింది. ఆ సమయంలో అడవి దున్నని పట్టుకోవడానికి 25 మంది ఫారెస్ట్ ఆఫీసర్ ఒక డ్రోన్ సాయంతో ప్రయత్నించిన అడవి దున్న దొరకలేదు. ఈ అడవి దున్ననే తాజాగా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామశివారులోకీ వచ్చిందని ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చౌటుప్పల్ ఫారెస్ట్ అధికారులు అడవిదున్నని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలనే చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో నక్క బావిలో పడిన సంఘటన తెలిసిందే. వరుసగా అడవి జంతువులు పరిసర గ్రామాల్లో సంచరిస్తున్నాయి.



Next Story

Most Viewed