Market : వారాంతపు సంతా...వర్షం పడితే చింత...!

by Kalyani |   ( Updated:2024-07-21 09:57:20.0  )
Market : వారాంతపు సంతా...వర్షం పడితే చింత...!
X

దిశ,తుంగతుర్తి : ప్రతి ఏటా లక్షల్లో ఆదాయం...అంతేకాదు ఏటేటా పెరుగుతున్న ఆదాయం...! నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని శ్రీశ్రీశ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న వారసంత అభివృద్ధి ఇది. మరి అంతా బాగుంది...!! వచ్చిన చిక్కేంది....? అనేది ఇక్కడ ప్రశ్న. దీనికి సమాధానం ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చిత్రమే. ప్రతి సోమవారం జరిగే ఈ సంతకు తుంగతుర్తి మండలం పరిసర గ్రామాలతో పాటు సూర్యాపేట,తిరుమలగిరి,తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల వ్యాపారులు వస్తుంటారు. అయితే వ్యాపారాలు కొనసాగించే వారి నుండి నిర్వాహకులు నిర్ణయించిన మేరకు రుసుంను ముక్కుపిండి వసూలు చేస్తుంటారు.

అయితే సంత నిర్వాహకులు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వర్షం వస్తే సంత ఆవరణ చిత్తడిగా తయారైనప్పటికీ బురదలోనే కొనసాగాల్సిందే. దీంతో సంతకు వచ్చి వివిధ రకాల సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసే వారంతా నరకాన్ని చూస్తున్నారు. అతి కష్టంపై బురదలోనే నడుచుకుంటూ కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బురదలో జారీ వివిధ రకాలుగా గాయపడుతున్నారు. సంబంధిత అధికారులు సమస్య పరిష్కారంపై చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



Next Story

Most Viewed