- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మృత్యువుగా మారుతున్న మూలమలుపు
దిశ, భూదాన్ పోచంపల్లి : ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన భూదాన్ పోచంపల్లిని సందర్శించేందుకు దేశ విదేశీయుల సైతం పట్టణ కేంద్రానికి వస్తుంటారు. అయితే పోచంపల్లికి కూతవేటు దూరంలో హైదరాబాద్ ఉండడంతో ఉద్యోగ వ్యాపారాలు చేసేందుకు వందల సంఖ్యలో నిత్యం రాకపోకలు నిర్వహిస్తుంటారు. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో గల చెరువు కట్టపై ఉన్న మూలమలుపు రోజురోజుకు మృత్యువుగా మారుతుంది. హైదరాబాదుకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. చెరువు కట్టపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించవు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఉందని జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవల హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు రాత్రి వేళలో పోచంపల్లికి వస్తుండగా మూలమలుపు కనిపించక కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో కారులోని ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గతంలో కూడా పలువురు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ దారి వెంట ప్రయాణించాలంటే ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందేనని చెప్పవచ్చు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు లేదా చెరువు కట్టకు ఇరువైపులా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.