పోలీస్అధికారిగా క్యాన్సర్ బాధితురాలు

by Dishaweb |
పోలీస్అధికారిగా క్యాన్సర్ బాధితురాలు
X

దిశ, సూర్యా పేట ప్రతినిధి: గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ధారవత్ స్వాతి పోలీసు అధికారి గా భాద్యతలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే చివ్వెంల మండలం జగన్ నాయక్ తండాకు చెందిన ధారవత్ చాంప్లా-రూప దంపతుల కుమార్తె స్వాతి కొన్ని సంవత్సరాల నుంచి క్యాన్సర్ తో బాధపడుతుంది. బాగా చదువుకుని పోలీస్ కావాలన్నా ఆమె కోరిక, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్న ఆ యువతి కల ను విధి వక్రీకరించింది. కోలుకోలేని ఒక మహమ్మారి ఆ యువతిని ఆవహించింది. క్యాన్సర్ మహమ్మారి ఆ యువతి ని చుట్టుముట్టింది.

ఎన్ని ఆసుపత్రిలు తిరిగినా ఫలితం లేకపోయింది. పోలీస్ కావాలన్న తన కోరికను మేక్ ఎ విష్‌ తో ఒక్కరోజు ఎస్సే గా బాధ్యతలు స్వీకరించిoది.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి తన బాధను తెలపడం తో స్పందించిన మంత్రి మూడు రోజుల క్రితం స్వాతికి మనోధైర్యం కల్పించడం కొసం ఆమె కుటుంబంతో తన క్యాంప్ కార్యాలయoలో భోజనం చేసి ధైర్యం చెప్పారు. ఒక్క రోజు పోలీస్ కావాలన్న తన కోరిక ను మంత్రి కి తెలపడం తో ఏర్పాట్లు చేయాలని పోలీసు యంత్రంగాన్ని ఆయన ఆదేశించారు. దీoతో మంగళవారం చివ్వేంల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేయడం తో ఒక్క రోజు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్వాతి ఆరొగ్యం త్వరగా మెరుగుపడాలని,తన ఆశయాన్ని, కలను నిజ జీవితంలో సాకారం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఆమెలో ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని నింపుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవితంలో పట్టుదల కలిగి, కలలను సాకారం చేసుకోవాలని తెలిపారు.

ఎస్సైగా స్వాతి

ఎస్సై గా బాధ్యతలు తీసుకున్న అనంతరం స్వాతి పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం కలిగేలా విచారణ చేసి ధైర్యం కల్పించి అండగా ఉండాలని ఆదేశించారు. నాకు అండగా ఉండి ఈ అవకాశం కల్పించి నా కల ను నిజం చేసిన జిల్లా ఎస్పీ, అధికారులకు, జిల్లా పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ వో డాక్టర్ కోటాచలం, డా.హర్షవర్ధన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమనారాయణ సింగ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్టేషన్ ఎస్ఐ విష్ణుమూర్తి, స్వాతి తల్లిదండ్రులు, సిబ్బంది, పాల్గొన్నారు.



Next Story

Most Viewed