- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
దోపిడీదారులకు రహదారులు వేసిన ప్రభుత్వం : బాషపంగు భాస్కర్

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : భూ మాఫియా, ఇసుక మాఫియా, వైన్ మాఫియాలతో దోపిడీదారులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రహదారులు వేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తుంగతుర్తి నియోజకవర్గ ఆశావహ అభ్యర్థి బాషపంగు భాస్కర్ అన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాల ప్రజలు ఆశించిన లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్లలో పక్కదారి పట్టించారని విమర్శించారు. 138 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మొదటిసారిగా హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు జరగడం తెలంగాణకు శుభసూచకం, చారిత్రక సంఘటన అని పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నష్టపోయినప్పటికీ, మొక్కవోని ధైర్యంతో, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు సన్నద్ధంగా ఉన్నారని చెప్పారు. 75 సీట్లతో అధికారంలోకి రాబోతున్నామని అందుకు విజయభేరీ సభనే నిదర్శనం అన్నారు. సోనియమ్మ ప్రకటించిన ఆరు హామీలు కర్ణాటకలో అమలవుతున్నాయని, అమలు చేసే హామీలనే సభలో ప్రకటించారని తెలిపారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే తెలంగాణలో కుటుంబ పాలనను తెచ్చారని విమర్శించారు. విజయభేరీ సభను విజయవంతం చేసిన తుంగతుర్తి నియోజకవర్గ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ అలీ, అనుదీప్, రాజు నాయక్, విజయ్, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.