'తెలంగాణాలో మళ్ళీ ఆంధ్ర పెత్తనం.. మరో ఉద్యమం ప్రారంభించాలి'

by Disha Web Desk 13 |
తెలంగాణాలో మళ్ళీ ఆంధ్ర పెత్తనం.. మరో ఉద్యమం ప్రారంభించాలి
X

దిశ, భువనగిరి రూరల్: తెలంగాణా ప్రజాతంత్ర వాదుల అధ్వర్యంలో వెంటిలేటర్ పై ప్రజాస్వామ్యం అనే అంశం పై గురువారం భువనగిరిలో సదస్సు జరిగింది. దీనికి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పి. నిరుప్, సీనియర్‌ జర్నలిస్ట్ పాశం యాదగిరి, తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్‌ దేశాయి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మన దేశంలో ప్రజాస్వామ్యం వెంటిలేటర్‌పై ఉందని.. దాన్ని కాపాడుకోవల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందని సదస్సులో ప్రముఖులు పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాలలో ఒక్క తెలంగాణ న్యాయవాది కూడా సుప్రీం కోర్టులో తెలంగాణ కోసం వాదించలేదన్నారు.

దేశమంతా అవినీతి, ఆక్రమాలతో నిండి పోయిందన్నారు. అదేవిధంగా ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేతుల్లో పెట్టారని ప్రశ్నించారు. హరీష్ రావు దగ్గర 7 పోర్టుపోలియోలు, కేటీఆర్ దగ్గర 14 పోర్టుపోలియోలు, కేసిఆర్ తో కలిపి మొత్తం 30 ఫోర్లు పోలియోలు వాళ్ళ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయన్నారు. ఒక్క కుటుంబంలో 30 పోర్టుపోలియోలు పెట్టుకుంటే, అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు.

గతంలో కమ్యూనిస్టులు జరిపిన తెలంగాణ రైతాంగ పోరాటంలో పేదవారందరికి భూములు పంచారని, కానీ మళ్ళీ ఆ భూములన్నీ వాపస్ వెళ్ళాయని ఆయన తెలిపారు. తెలంగాణలో రెవెన్యూ సిస్టమే లేదని ధరణిలో తప్పులు దొర్లితే సివిల్ కోర్టుకు వెళ్ళమంటారని తెలిపారు. తెలంగాణలో కమ్యూనిస్టులు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయటం లేదని వారు ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంత ఖర్చుఅయ్యిందని గొప్పగా చెప్పుకుంటున్నారని.. ఇది సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవటానికి మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా 1969లో ఉద్యమం తర్వాత, ప్రత్యేక తెలంగాణా పోరాటం ఎగిసి పడటానికి చంద్రబాబు ముఖ్య కారణమనమని తెలంగాణ భూములన్నీ సీమాద్రవాళ్ళకు కట్టబెట్టి రియల్ఎస్టేట్ వ్యాపారం చేశాడని అన్నారు.

మొట్టమొదటి తెలంగాణ ఉధ్యమం జర్నలిస్టులే ప్రారంభించారన్నారు. ముందుగా భువనగిరిలోనే తెలంగాణ ఉధ్యమానికి తొలిఅడుగు పడిందన్నారు. ఆ తరువాత సూర్యాపేట, నల్లగొండ తదితర చోట్ల సమావేశాలు నిర్వహించామన్నారు. అప్పుడు రాజకీయ నాయకులు ఎవరూ లేరని తెలిపారు. ఎంతో మంది తెలంగాణ వాదులను నయీం పేరుతో పోలీసులే చంపేవారన్నారని.. అతని మీద ఒక్క ఎఫ్.ఐ.ఆర్ లేదన్నారు.

తెలంగాణ కోసం పోరాటం చేసిన బెల్లి లలితను హత్య చేయటం జరిగిందన్నారు. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన పిట్టల శ్రీశైలం మీద ఎన్నో కేసులు పెట్టారు. గద్దర్ మీద కాల్పులు జరిపారని.. అప్పుడు కేసిఆర్ ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. తరువాత మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన ఇంద్రారెడ్డితో జై తెలంగాణ పార్టీని గద్దర్ పెట్టించాడన్నారు. ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్‌ను తీసుకు రావటం జరిగిందన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, గట్టిగా మాట్లాడితే జైల్లో పెట్టే పరిస్థితి ఉందని దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం మళ్ళీ మనంమంతా మరో ఉద్యమం చేయాలని వారు తెలిపారు. రావి సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అస్సలు తెలంగాణా వాదుల ముఖ్యవేదిక రాష్ట్ర కన్వీనర్ భువనగిరి శ్రీనివాస్ నేత, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ రెడ్డి, దళిత రాష్ట్ర ఐక్యవేదిక చైర్మన్ బట్టు రామచంద్రయ్య, పిట్టల శ్రీశైలం, మున్సిపల్ ప్లోరీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, పీసీసీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్, కడారి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story