- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా లీకైన గ్యాస్.. పరుగులు పెట్టిన విద్యార్థినులు..

X
దిశ, కోదాడ : తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ పైప్ లీకేజ్ కావడంతో విద్యార్థినిలు ఒక్కసారిగా రోడ్డుపైకి పరుగులు పెట్టారు. కోదాడ పట్టణంలో ఆజాద్ నగర్ లోని గర్ల్స్ హై స్కూల్ సమీపంలో మున్సిపాలిటీ వారు నీటి పైపులైన్ మరమ్మతులో భాగంగా గుంతను తవ్వుతున్నారు. ఈ క్రమంలో ఒక్క సారిగా గ్యాస్ పైప్ లైన్ కు గడ్డపార తగలడంతో పైపు పగిలి గ్యాస్ పైకి వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాక విద్యార్థినులు ఒక్కసారిగా బయటికి పరుగులు పెట్టారు. సకాలంలో పోలీసులు, ఫైర్, గ్యాస్ సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story