ఆ పార్టీలకు బిగ్ షాక్.. TRSలోకి 50 కుటుంబాలు

by Disha Web |
ఆ పార్టీలకు బిగ్ షాక్.. TRSలోకి 50 కుటుంబాలు
X

దిశ ఆత్మకూరు : దాదాపు 50 మంది కుటుంబీకులు గురువారం రోజు టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జక్కు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, వివిధ పార్టీల నుండి అదే గ్రామానికి చెందిన 50 మంది కుటుంబాలను ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లోకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ పేదల పక్షపాతిగా పనిచేస్తూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్నట్లుగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ముందంజలో ఉందని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్, గనగని మల్లేశం గౌడ్, ఎర్ర వెంకటరెడ్డి,మక్తల స్వామి గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed