ఒక కోటి 93 లక్షల విలువైన గంజాయి కాల్చివేత

by Kalyani |
ఒక కోటి 93 లక్షల విలువైన గంజాయి కాల్చివేత
X

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 1,379 కేజీల గంజాయి కాల్చి వేసినట్లు నల్గొండ ఎస్పీ చందన దీప్తి తెలిపారు. తిప్పర్తి, శాలిగౌరరం, నారకట్పల్లి, కేతపల్లి, కట్టంగూరు, కనగల్,న ల్లగొండ వన్ టౌన్, నల్లగొండ రూరల్,చండూరు పోలీస్ స్టేషన్లు పరిధిలో 26 కేసులలో పట్టుబడిన గంజాయిని అన్నేపర్తి బెటాలియన్ ఫైరింగ్ రేంజ్ స్థలంలో ఆమె కాల్చివేశారు. ఆమె మాట్లాడుతూ.. అత్యధికంగా గంజాయి కేతపల్లి లో పట్టుబడింది అన్నారు.

కోర్టు ఆదేశాల మేరకు డీస్ట్రిక్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. కాల్చివేసిన గంజాయి విలువ ఒక కోటి 93 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్,యస్.బి డి.ఎస్.పి రమేష్, నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి, , డి.సి.ఆర్.బి డి.ఎస్.పి సైదా, సీఐ రాఘవరావు, బీసన్న,సైదులు, నాగరాజు,ఆర్.ఐ లు సురాప్ప నాయుడు,సంతోష్,ఎస్.ఐ అంతి రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed