కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

by Taduka Kalyani |

జలమండలి కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
X

దిశ, హిమాయత్ నగర్ : జలమండలి కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. కార్మికులను ఆదుకోవడంలో ప్రజా ప్రభుత్వం ముందుంటుందని ఆయన తెలిపారు. ఇటీవలే జలమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగుళ్ల రాజిరెడ్డి, తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఏ. శ్రవణ్ కుమార్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story