ఖబర్దార్..! అలాంటి వారిని చీల్చి చెండాడుతాం: ఎంపీ ఈటల మాస్ వార్నింగ్

by Mahesh |   ( Updated:2025-01-22 12:59:03.0  )
ఖబర్దార్..! అలాంటి వారిని చీల్చి చెండాడుతాం: ఎంపీ ఈటల మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం ఏకశిలానగర్‌(Ekshilanagar)లో రియల్ ఎస్టెట్ బ్రోకర్ పై మల్కాజ్‌గిరి(Malkajgiri) ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) చేయి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆయనపై కేసు నమోదు కాగా తెలుగు మీడియాలో వచ్చిన అసత్యపు ప్రచారాల(False propaganda)పై బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నగర ప్రజలపై హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ప్రతి రోజు తన కార్యాలయానికి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రజలు ఇచ్చి తమ ఇళ్లను అక్రమంగా కూలగొడుతున్నారని, తమ ఇళ్లను కూలగొట్టకుండా కాపాడాలని అప్లీకేషన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

అలాగే పలువురు బిల్డర్లు(Builders), గుండాలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు(Real estate brokers) సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇదే సమస్యలపై తాము పోలీసులకు ఫోన్ చేసినా.. పట్టించుకోవడం లేదని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారని అన్నారు. దీంతో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో చివరి ప్రయత్నంగా మేడ్చల్ కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిపారు. అలాగే నిన్న ఓ వ్యక్తిపై తాను దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. అలాగే అంతకు ముందు ఏకశిలానగర్‌లో ప్లాట్ల ఓనర్లపై సదరు వ్యక్తులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలను చూపించారు. అలాగే ఏకశిలానగర్‌ కు సంబందించిన ప్లాట్ల అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి వివరించారు.

అనంతరం హర్ష నిర్మాణ కంపెనీ(Harsha Construction Company) ప్రజలను భయాందోళనకు గురి చేసి పలు ప్లాట్లను కొనుగోలు చేసి.. చుట్టు పక్కల ప్లాట్లను సైతం కబ్జాకు ప్రయత్నం చేశారని తెలిపారు. అలాగే మరోసారి కూడా 47 ఎకరాల భూమిపై కోర్టు తీర్పు అనంతరం ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అన్నారు. 2010 నుంచి పలుమార్లు.. కబ్జాలకు ప్రయత్నించిన వ్యక్తులు.. మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే సాధారణ ప్రజలపై ఇన్నిసార్లు దౌర్జన్యాలు జరుగుతున్న తాను ఎన్నిసార్లు.. ఫిర్యాదులు చేసిన పోలీసులు, కలెక్టర్లు పట్టించుకోలేదని గుర్తు చేశారు. అలాగే సదరు ప్రాంతంలో ఇళ్లు కట్టుకుంటే దానిని గుండాలు కూలగొట్టినట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఏకశిలానగర్‌లో ఓ మహిళను సైతం రియల్ ఎస్టెట్ బ్రోకర్లు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, తమను బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు తన వద్దకు వచ్చి వెడుకున్నారని అన్నాడు.

ఈ క్రమంలోనే బాధితుల తరుఫున తాను అక్కడికి వెళ్లానని, ఆ సమయంలో అక్కడే ఉన్న సదరు వ్యక్తులు తమతో ఎంపీ అనే మర్యాద లేకుండా వ్యవహరించారని గుర్తు చేశారు. పేద, మధ్యతరగతి వారు.. రూపాయి రూపాయి పోగు చేసుకుని కొనుగోలు చేసిన పేదల భూములను కొందరు దుర్మార్గులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. ఈ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అలాగే పేదలకు సమస్యలు వస్తే బీజేపీ పార్టీ ఇక మీదట ఊరుకోదని.. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తామని, హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఉన్న అందరి పేద ప్రజల తరపున వారికి మద్దతుగా పోరాడుతామని అన్నారు.

అలాగే తనలాంటి సౌమ్యుడు సైతం ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకునే స్థాయిలో యంత్రాంగం వ్యవహరిస్తుందని అన్నారు. అలాగే పేద ప్రజలను ఇబ్బంది పెట్టిన, మహిళలతో అసహ్యంగా వ్యవహరించిన బీజేపీ పార్టీ నేతలుగా తాము చూస్తూ ఊరుకోమని, ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతామని ఈ సందర్భంగా మంత్రి ఈటల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే పోలీసులు, అధికారులు సైతం చట్టాన్ని అనుసరించాలని, బాసులకు వత్తాసుగా వ్యవహరించకూడదు అని ఈ సందర్భం ఆయన రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Next Story