- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుంభమేళలో సామాన్యుడిలా 10 కి.మీ నడిచి వెళ్లిన ఎంపీ ఈటల

దిశ, వెబ్ డెస్క్: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ (Malkajgiri BJP MP) ఈటల రాజేందర్ (Etala Rajender) ఈ రోజు తెల్లవారుజామున ప్రయాగ్ రాజ్ (Prayag Raj) లోని కుంభమేళ (Kumbh Mela)లో పవిత్ర స్నానం (holy bath) చేశారు. జహిరాబాద్ మాజీ ఎంపీ (Zahirabad Former MP) బీబీ పాటిల్(Patil) తో పాటు మరికొంతమంది తో కలిసి యూపీ (UP) వెళ్లిన ఈటల (Etala).. రాత్రి అక్కడే బస చేశారు. కుంభమేళలో ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ప్రొటోకాల్ (protocol) ఉన్నప్పటికి.. అవన్ని కాదనుకొని.. సామాన్యుడిలా ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. దాదాపు 10 కిలో మీటర్లు ప్రజలతో కాలినడకన (on foot) త్రివేణి సంగమానికి (Triveni Sangam) చేరుకొని.. సంగంలో పవిత్ర స్నానం ((holy bath)) చేశారు. అలాగే త్రివేణి సంగమానికి పూజలు (Pujas for Triveni Sangam) చేశారు. అనంతరం ఎంపీ ఈటలకు స్థానిక పూజారులు ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు (Tirtha Prasads) అందించారు.
కాగా దీనికి సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఎంపీ ఈటల (MP Eatala), మాజీ ఎంపీ బీబీ పాటిల్ కలిసి ప్రజలతో పాటు నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. కాగా జనవరి 13న ప్రయాగ్ రాజ్‌లో ఈ మహాకుంభమేళ (Mahakumbh Mela) ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు దాదాపు 45 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే సంగమంలో (Triveni Sangam) పవిత్ర స్నానాలు (holy bath) ఆచరించారు. ఈ నెల 26న మహాశివరాత్రి తో మహా కుంభమేళ ముగియనుంది. కాగా చివరి రోజు శివరాత్రి (Shivratri) కావడంతో 5 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానం ఆచరించే అవకాశం ఉందని.. ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తుంది.