కారు పరేషాను! ఎంపీ ఆశావాహుల్లో ఒకటే గుబులు! ఎందుకో తెలుసా?

by Disha Web Desk 14 |
కారు పరేషాను! ఎంపీ ఆశావాహుల్లో ఒకటే గుబులు! ఎందుకో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో ఈ ఎన్నికల్లో దూసుకుపోతుంది. బీజేపీ పార్టీ కూడా ప్రధాని మోడీ మంత్రంతో ఫోకస్ పెంచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై నజర్ పెట్టింది. కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా పరేషానులోనే ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ అని టాక్!

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే లోక్ సభ ఎన్నికల్లో పోటీ ఉండబోతుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, సెంట్రలల్లో బీజేపీ ఉండటం, మరోవైపు రెండు పార్టీలు జాతీయ పార్టీలు కావడంతో, ఆ రెండు పార్టీలే ఎంపీ ఎన్నికల్లో చక్రం తిప్పుతాయని చర్చానీయాంశంగా మారింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో మూడో ప్లేస్‌కు బీఆర్ఎస్ పరిమితి అవుతుందని వాదనలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గుబులు మొదలైంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్లాన్‌లు వేసుకుంది.

గెలుస్తామా? లేదా? అనే టెన్షన్!

బీఆర్ఎస్‌లో ఉన్న లోకల్ స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కారు వదిలి హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల చాలా మంది నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రజల్లో వ్యతిరేకత చూసి.. బీఆర్ఎస్ నుంచి ఎంపీ పోటీ చేయాలనుకునే ఆశావాహుల్లో గెలుస్తామా? లేదా? అనే టెన్షన్ మొదలైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, పి. రాములు అసంతృప్తితో ఉన్నారని, వీరు బీజేపీ లో జాయిన్ అవుతారనే చర్చ మొదలైంది. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత రంజిత్ రెడ్డి సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రజల్లో వెళ్లే ముందు నేతల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంట్ వారీగా సమావేశాలు నిర్వహించిందని టాక్ నడుస్తోంది.



Next Story

Most Viewed