- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా కొడుకు ఎక్కడ?’.. పది రోజులుగా స్కూల్ ఎదుటే తల్లి గోస (వీడియో)
by Gantepaka Srikanth |
‘నా కొడుకు ఎక్కడ?’.. పది రోజులుగా స్కూల్ ఎదుటే తల్లి గోస (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: కుమారుడి కోసం పది రోజులుగా స్కూల్ ఎదుటే తల్లి పడిగాపులు కాస్తున్న ఘటన మేడ్చల్(Medchal) జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కార్తీక్ అనే విద్యార్థి మేడ్చల్ జిల్లాలోని జాన్ అకాడమీ(Medchal John's Academy) రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి చదువుతున్నాడు. ఇటీవల కార్తీక్ స్కూల్ ఆవరణలో చలిమంట వేసుకున్నాడని.. అది తెలిసి వార్డెన్ మందలించాడని తల్లి ఆరోపిస్తోంది. వార్డన్ మందలించిన నాటి నుంచి తమ కుమారుడు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ కుమారుడి కోసం 8 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. తమ కుమారుడి ఆచూకీ తెలపాలంటూ స్కూల్ ఎదుట తల్లి బంధువులతో కలిసి ఆందోళన చేస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులు వేడుకున్నారు.
Next Story






