గుండెల నిండా బాధ నింపిన 'దేవుడు పెట్టిన పరీక్ష'

by Disha Web |
గుండెల నిండా బాధ నింపిన దేవుడు పెట్టిన పరీక్ష
X

దిశ, బిచ్కుంద: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్ష రోజే తల్లి మరణించడంతో పుట్టెడు దు:ఖంతో ఓ యువతి పరీక్ష కేంద్రానికి వచ్చిన ఘటన అందరినీ కంటనీరు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన రేణుక అనే యువతి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే, ఇవాళ(గురువారం) పరీక్ష ఉండగా.. అకస్మాత్తుగా తల్లి మరణించింది. దీంతో శవాన్ని వదిలి పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దిగమింగుకొని పరీక్షకు హాజరు కాక తప్పలేదు. యువతి రోధిస్తూ.. పరీక్ష కేంద్రానికి వెళ్లడం చూసిన కాలనీవాసులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హృదయవిదారకర ఘటన బిచ్కుంద మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Next Story