వారిద్దరిది ఆత్మహత్య కాదు... హత్యే....!

by Disha Web Desk |
వారిద్దరిది ఆత్మహత్య కాదు... హత్యే....!
X

దిశ, ఖైరతాబాద్ : తులసి బాయి, ఆమె కూతురు ది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. బోరబండలోని సారథి నగర్‌కు చెందిన తులసి బాయ్ ఆమె కూతురు ఆత్మహత్య చేసుకున్నారంటూ అన్ని ప్రసారమాధ్యమాలలో వచ్చిన సంగతి విధితమే. కాగా శుక్రవారం ఆమె కూతురు జ్యోతి, మరిది, బంధువులు మీడియా ముందు వారి గోడును విన్నవించుకున్నారు. తల్లి కూతురుని ఇద్దరిని హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత మూడు సంవత్సరాల క్రితం తులసి బాయ్ భర్త గోపాల్‌ను కూడా ఇదే తరహాలో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కానీ, అది హత్యగా రుజువు అయిందని దానికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఈ హత్యలు కూడా అతనే చేశాడని పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అక్కడ నివాసం ఉంటున్న గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేసి అక్కడ నుంచి గుడిసెలను ఖాళీ చేయించి భూమిని ఆక్రమించాలనే అక్కస్సుతోనే వరుస హత్యలకు పాల్పడుతున్నారని స్థానికులలో సర్వత్ర గుసగుసలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed