- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
- OTT Release
- భక్తి
బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి: PDSU

దిశ, తెలంగాణ బ్యూరో: ఫిబ్రవరి 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శ్యామ్, కంచనపల్లి శ్రీను మార్క్స్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 'కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య నా కల' అని సీఎం కేసీఆర్ అన్నారని, నేడు నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యను నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా రంగానికి 9, 10 శాతం నిధులు కేటాయిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 6 శాతం నిధులకు పరిమితమైందని దుయ్యబట్టారు.
సీఎం మూడ విశ్వాసాల కోసం వందల వేల కోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టి ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలకు కనీసం టాయిలెట్స్ లేని దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాక పోవడంతో 3500 కోట్ల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు. తక్షణమేలో బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు గౌతం, రాకేష్, సాయి, గణేష్, మాధవి తదితరులు పాల్గొన్నారు.