రాష్ట్రంలో 'మంకీ ఫాక్స్' ​అలెర్ట్.. విదేశీయులపై నిఘా..​

by Dishafeatures2 |
రాష్ట్రంలో మంకీ ఫాక్స్ ​అలెర్ట్.. విదేశీయులపై నిఘా..​
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంకీ ఫాక్స్​ అలర్ట్ ​జారీ అయింది. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శరీరంపై దద్దుర్లు, పుండ్లు వంటివి ఉంటే వెంటనే వైద్యారోగ్యశాఖకు సమాచారం ఇవ్వాలని సర్కార్ ​కోరింది. వెంటనే క్వారంటైన్​కావాలని స్పష్టం చేసింది. అంతేగాక ఇతర దేశాల నుంచి వచ్చినోళ్లపై నిఘా పెట్టాలని జిల్లా వైద్యాధికారులకు హెల్త్​ డిపార్ట్​మెంట్​ఆదేశాలు ఇచ్చింది. అయితే మంకీ పాక్స్​ లక్షణాలు ఉన్నోళ్ల శాంపిళ్లను పూణే వైరాలజీ ల్యాబ్​కు పంపించాలని ఆఫీసర్లు నిర్ణయించారు.

ముఖ్యంగా హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ డీఎమ్​హెచ్​ఓలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల గాలింపు చర్యలు చేపట్టారు. ఎయిర్​పోర్టు అధికారులు, వైద్యశాఖ, మున్సిపల్​ ఆఫీసర్లు సమన్వయమై ఎంక్వైరీ స్టార్ట్​ చేశారు. మరోవైపు మంకీ ఫాక్స్​సోకిన వారికి ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, అలసట వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.



Next Story