హిందూ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు.. మోడీపై చాడ వెంకటరెడ్డి ఫైర్

by Disha Web Desk 4 |
హిందూ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు.. మోడీపై చాడ వెంకటరెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ ప్రధాని నరేంద్ర మోడీ హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి ముస్లిం మైనారిటీలపై పరోక్ష దాడులకు పాల్పడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ప్రజల ప్రాథమిక హక్కులకు హరించే విధంగా ఉన్నాయన్నారు. హిందువుల ఓట్లను రాబట్టుకోవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు తగవని, దేశంలో నల్ల డబ్బులు వెలికి తీసి ప్రజలకు పంచుతానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వంటి హామీలపై నరేంద్ర మోడీ మాట్లాడితే బాగుండేదని అన్నారు.

రాజ్యాంగ విరుద్ధంగా, వ్యవస్థకు భంగం కలిగించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండడం ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని అన్నారు. దేశ రాజధానిలో వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని 356 రోజులు రైతులు ధర్నా చేస్తే చట్టాలను వెనకకు తీసుకుంటున్నామని చెప్పి ఇప్పటివరకు ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. మరోసారి ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీని ప్రధాని చేస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికే అసంఘటిత రంగం నిర్వీర్యం అయిందని, వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, తదితర వర్గాలు ఎన్డీఏ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయాయన్నారు.

Next Story

Most Viewed