- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు మాక్ ఎంసెట్ టెస్ట్‌లు.. ముందుకొచ్చిన ఎక్స్‌ప్లోర్ సంస్థ
దిశ, తెలంగాణ బ్యూరో: మాక్ ఎంసెట్ టెస్టులతో విద్యార్థులకు పరీక్షలపై ఒక అవగాహన వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ ఆన్లైన్ అసెస్మెంట్ ప్లాట్‌ఫాం సంస్థ ఐన ఎక్స్ ప్లోర్ సంస్థ, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కీసర, ఆధ్వర్యంలో నిర్వహించబడే మాక్ ఎంసెట్ టెస్ట్ సిరీస్‌కు సంబందించిన పోస్టర్‌ను సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాక్ టెస్ట్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు.
విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి పరీక్షలు రాయాలని సూచించారు. సంస్థ డైరెక్టర్ అఖిల్ మోదే మాట్లాడుతూ ఈ సిరీస్ లోని నాలుగు మాక్ టెస్టులను ఎంసెట్ కు హాజరు కానున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి ప్రాక్టీస్ కొరకు వినియోగించుకొనవచ్చునని తెలిపారు. పరీక్ష రాసిన వారికి వారి ఫలితాలు వెంటనే తెలియబడుతాయని, తద్వారా మెయిన్ పరీక్షలకు విద్యార్థులు మరింత మెరుగైన కృషి చేయవచ్చని తెలిపారు. సంస్థ డైరెక్టర్ తాడేపల్లి సునీల్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మంచి ప్రమాణాలతో కూర్చబడినవి అని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tseamcet.xplore.co.in/ నందు నమోదు చేసుకొనవలసినదిగా కోరారు. మొదటి మాక్ టెస్ట్ ఏప్రిల్ 5వ తేదీన ఉదయం 9 గం నుంచి సాయంత్రం 5 గం వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. తదుపరి మాక్ టెస్టులు ఏప్రిల్ 15, 25, 30 తేదీల్లో నిర్వహించబడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్‌ప్లోర్ సంస్థ మార్కెటింగ్ హెడ్ ప్రణీత్ నల్లి తదితరులు పాల్గొన్నారు.