- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవాణా శాఖ అలర్ట్.. రంగంలోకి మొబైల్ స్క్వాడ్‌లు.. 211 వాహనాలు సీజ్!
by Ramesh Naini |
రాష్ట్రవ్యాప్తంగా 12 మొబైల్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా 12 మొబైల్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి 10 జిల్లాల్లో ఒక్కోటి, రాష్ట్రస్థాయిలో 2 తనిఖీ బృందాలు పని చేయనున్నాయని వెల్లడించింది. ప్రతి బృందంలో నలుగురు వాహన తనిఖీ అధికారులు ఉంటారని తెలిపింది. ఈ తనిఖీ బృందాలు జూన్ 8వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన 211 వాహనాలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేశామని రవాణా శాఖ వెల్లడించింది. ఇందులో త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలు, ఓవర్ లోడ్‌తో తిరిగే వాహనాలు ఉన్నాయని రవాణా శాఖ తెలిపింది. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనదారులు చెల్లించాలని సూచించింది.
Next Story






