దమ్మున్న సీఎం.. ధైర్యం గల ప్రకటన: ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Disha Web Desk 19 |
దమ్మున్న సీఎం.. ధైర్యం గల ప్రకటన: ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దమ్మున్న ముఖ్యమంత్రి.. ధైర్యంగల ప్రకటన చేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సోమవారం 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయం అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారన్నారు. సీఎం ధైర్యవంతమైన నాయకత్వంపై, ప్రభావశీలమైన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకముందన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని వినమ్రంగా కోరుతున్నాం అని పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అని అన్నారు.

Next Story

Most Viewed