మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ, తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లారని వైసీపీ నేతలు కామెంట్లు చేసుకుంటున్నారు. కాగా, చంద్రబాబు అరెస్ట్‌పై వివిధ పార్టీల నాయకులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌పై శనివారం సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కవిత ఆన్సర్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమని అన్నారు.

ఆయన కుటుంబ సభ్యుల బాధ అర్థం చేసుకోగలనని రిప్లై ఇచ్చారు. కాగా, చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తమ స్టాండ్ ఏంటో ప్రకటించాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చంద్రబాబు అరెస్ట్‌పై అధికారికంగా స్పందించలేదు. కాకపోతే టీడీపీ నుండి బీఆర్ఎస్‌లోకి వచ్చిన పోచారం, తలసాని, మోత్కుపల్లి వంటి నేతలు మాత్రం రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సైతం బాబు అరెస్ట్‌పై స్పందించలేదు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొనడం గమనార్హం.Next Story

Most Viewed