అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేస్తా.. MLC కవిత కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేస్తా.. MLC కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిది మహిళా వ్యతిరేక ప్రభుత్వమన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువును సృష్టించిందని మండిపడ్డారు. కాళేశ్వర ప్రాజెక్టును బద్నాం చేయాలనే కృత్రిమ కరువును సృష్టించారని అన్నారు. అందరూ అంటున్నట్లుగానే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారని ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని అన్నారు. జీవో-3 ద్వారా రాష్ట్ర ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తక్షణమే జీవోను రద్దు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా ధర్నా చేస్తానని అన్నారు.



Next Story

Most Viewed