తెలంగాణ రైతాంగానికి శ‌నిలా బీజేపీ విధానాలు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

by Ajay Maddhiboyina |

తెలంగాణ రైతాంగానికి శ‌నిలా బీజేపీ విధానాలున్నాయని, ధాన్యం ఎలా మా ఆఫీసు ముందు పోస్తారో చూస్తామ‌ని అని రామ‌చంద్ర రావు అంటున్నారు, ఏందీ మీరు చూసేది? రైతుల కడుపు మండితే వాళ్లను ఆప‌గ‌లుగుతారా? అని ప్రభుత్వ విప్, వేముల వీరేశం మండిపడ్డారు.

తెలంగాణ రైతాంగానికి శ‌నిలా బీజేపీ విధానాలు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైతాంగానికి శ‌నిలా బీజేపీ విధానాలున్నాయని, ధాన్యం ఎలా మా ఆఫీసు ముందు పోస్తారో చూస్తామ‌ని అని రామ‌చంద్ర రావు అంటున్నారు, ఏందీ మీరు చూసేది? రైతుల కడుపు మండితే వాళ్లను ఆప‌గ‌లుగుతారా? అని ప్రభుత్వ విప్, వేముల వీరేశం మండిపడ్డారు. మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామ‌చంద్రరావు కొత్తగా బీజేపీ అధ్యక్షుడు అయ్యాడు, ఆయ‌న‌కు అవ‌గ‌హ‌న లేదు, రైతుల బ‌రి తెగిస్తే ఆపే శ‌క్తి మీకు ఉందా? రైతులు తిర‌గ‌బ‌డితే తెలంగాణ‌లో కూక‌టివేళ్లతో మీ పార్టీని పీకేస్తారని ఫైర్ అయ్యారు. కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, పార్టీ నాయ‌కులంతా మాట్లాడుకుని 15 లోపు ప్రతి గింజ కేంద్రంతో కొన‌పిస్తామ‌ని ప్రక‌టిస్తే మంచిదని, ప్రక‌టించ‌క‌పోతే 15 త‌ర్వాత తెలంగాణ రైతుల తెగింపు ముందు మీ ఆఫీసులు, మీ ఎమ్మెల్యేల ఇళ్లు ధాన్యంతో నిండిపోతాయి జాగ్రత్త అని వేముల వీరేశం హెచ్చరించారు. రైతుల ముందు ప్రధాని మోదీ మోక‌రిల్లి క్షమాప‌ణ చెప్పి న‌ల్లచ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకున్న విష‌యం మ‌రిచిపోయారు? తెలంగాణ‌కు బీజేపీ తీర‌న ద్రోహం చేస్తోందని వేముల వీరేశం విమర్శించారు. బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ ప‌నిచేస్తోందని, రెండు పార్టీలు కూడ‌బ‌ల్కొని క‌రెంటు రాలేద‌ని, పంట‌లు ఎండిపోతున్నాయ‌ని త‌ప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

పంట దిగుబ‌డి క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి వ‌స్తుంద‌న్న భ‌యంతోనే త‌ప్పుడు ప్రచారం మొద‌లు పెట్టారని, తెలంగాణ‌లో దుర్మార్గమైన రాజ‌కీయ క్రీడ‌కు తెర లేపారని వేముల వీరేశం ఆరోపణలు గుప్పించారు. రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసం త‌ప్ప రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను తెలంగాణ బీజేపీ నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేదని, సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశల‌కు స‌మాధానం చెప్పకుండా బీజేపీ అధ్యక్షుడు రామ‌చంద్రరావు డొంక తిరుగుడు స‌మాధానాలు చెపుతున్నాడని ఆయన మండిపడ్డారు. ఇప్పటికి 75 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసింది, మిగిలిన‌వి కూడా కొంటాం, పంజాబ్, హ‌ర్యానాల్లో సేక‌రించిన‌ట్లుగానే తెలంగాణ‌లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని అడుగుతుంటే దానికి స‌మాధానం లేదు, నిస్సహాయ‌మైన అధ్యక్షుడు రామ‌చంద్ర రావు అని వేముల వీరేశం ఆగ్రహాం వ్యక్తం చేశారు. తుమ్మిడిహ‌ట్టి పైన మ‌హారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి లేఖ‌లు రాశారని, కానీ, బీజేపీ అధ్యక్షుడు రామ‌చంద్రరావు లేఖ రాయ‌లేద‌ని చెపుతున్నారని ఆయన విమర్శించారు. పార‌ద‌ర్శకంగా ధాన్యం కొనుగోళ్లు జ‌రుగుతుంటే అక్కసు, ఓర్వలేని బుద్ధి, దుర్మార్గమైన రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌తో రైతుల‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వేముల వీరేశం మండిపడ్డారు.

Next Story