కౌశిక్ రెడ్డి ఆరోపణలకు MLA శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

by Gantepaka Srikanth |
కౌశిక్ రెడ్డి ఆరోపణలకు MLA శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్టీపీసీ లారీలు ఓవర్ లోడ్ తో వెళ్తే ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లోని మీడియా పాయింట్‌లో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బూడిదై, చెత్త రాజకీయం చేస్తుందన్నారు. రోజుకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు గడిచిన 10 ఏళ్లలో ఎంత సంపాదించారు? అంటూ ప్రశ్నించారు. ఎన్టీపీసీ పనులు ప్రారంభించినప్పటి నుంచి రైతులకు బూడిదను ఉచితంగా ఇచ్చామన్నారు. తమ మంత్రిపై వంద కోట్ల అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో ఇసుక, ఎర్రమట్టి అక్రమంగా దోపిడి చేసింది? బీఆర్ఎసే కదా? అని గుర్తు చేశారు. పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ కోసం పోరాడిండని స్వయంగా కేసీఆర్ అభినందించిన సంగతి బీఆర్ఎస్ నాయకులు మరిచిపోయారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం రైతు భరోసాను జూన్, జూలైలో వేశారన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు గురించి విచారణ జరుగుతుందన్నారు. విచారణ కు పాడి కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉండాలన్నారు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేసి తీరుతామన్నారు.

హరీష్​మాట మార్చి రైతు రుణామఫీ తో పాటు 6 గ్యారంటీలు అని రాజీనామాపై మాట్లాడుతుండన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ...గతంలో బీఆర్ ఎస్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వం మీద బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. పాడి కౌశిక్ రెడ్డి బేస్ లెస్ ఆరోపణలు చేస్తుండన్నారు. భార్య పిల్లల పేరుతో రాజకీయాలు చేసే నీచ స్థాయికి కౌశిక్ దిగజారిండన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తెర వెనుక ఉండి మాట్లాడిస్తున్నారన్నారు. పొన్నం ప్రభాకర్ కు కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..పంచాభూతాలను గుప్పిట్లో పెట్టుకుని దోచుకునేందుకు ప్రయత్నం చేస్తే, బీఆర్ఎస్ భూస్థాపితమయ్యేలా ప్రకృతి ఇన్వాల్వ్ అయిందన్నారు.2009 నోటిఫికేషన్ ప్రకారం బూడిదను రైతులకు ఉచితంగా ఇవ్వాలన్నారు. బిల్డింగ్, రోడ్లు వేసే వాళ్లకు 100 కిలోమీటర్ల లోపు ఉచితంగా ఇచ్చారన్నారు. 2022 నుండి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్ ద్వారా ఎన్ టీపీసీ బూడిదను అమ్ముతున్నారన్నారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్మెంట్ ఉండదన్నారు. కొంతమంది రాజకీయ దయాదాక్షిణ్యాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు.



Next Story

Most Viewed