జహీరాబాద్ ఎంపీగా పోటీపై రాజాసింగ్ హాట్ కామెంట్స్..

by Disha Web Desk 14 |
జహీరాబాద్ ఎంపీగా పోటీపై రాజాసింగ్ హాట్ కామెంట్స్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం హాట్ టాపిక్‌గా మారింది. ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారని చర్చనీయంశంగా మారింది. దానికి కారణం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జహీరాబాద్‌లో పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని గతంలో రాజాసింగ్ చెప్పారు. కానీ నేడు ఆయన ఎంపీగా పోటీపై ఆసక్తి లేదన్నారు. తాజాగా అసెంబ్లీ ఆవరణలో రాజాసింగ్ ఈ వ్యవహారంపై స్పందించారు.‘జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్తోంది. నాకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదు’ అని మీడియా చిట్ చాట్‌లో స్పష్టం చేశారు. హిందూ రాజ్యం స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలనుకుంటున్నాని తెలిపారు.

శాసనసభ పక్షనేత పదవిపై తనకు ఆసక్తి లేదన్నారు. ఎవరో ఒకరు.. ఫ్లోర్ లీడర్‌గా త్వరగా ఎంపిక చేస్తే బావుంటుందన్నారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి.. బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్‌గా నియమించాలని మా జాతీయ నాయకత్వం అనుకుంటోందని స్పష్టంచేశారు. బండి సంజయ్ కోసం కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం చేస్తానని చెప్పారు.



Next Story

Most Viewed