దమ్ముంటే రా.. మంత్రి ప్రశాంత్ రెడ్డికి కర్నాటక ఎమ్మెల్యే ఛాలెంజ్

by Satheesh |
దమ్ముంటే రా.. మంత్రి ప్రశాంత్ రెడ్డికి కర్నాటక ఎమ్మెల్యే ఛాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి దమ్ము, సత్తా ఉంటే కర్నాటక గ్యారెంటీలపై ఓపెన్ ఛాలెంజ్‌కు రావాలని కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సవాల్ విసిరారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వేల్పూరు చౌరస్తాకు నేను వస్తానని మీరు కూడా వస్తే విమానంలో కర్నాటకు తీసుకెళ్లి మా గ్యారెంటీలను నిరూపిస్తామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన ప్రదీప్ ఈశ్వర్.. ఓటమి భయంతోనే ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారెంటీలపై అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. తాము ప్రకటించిన అన్ని గ్యారెంటీలు కర్నాటకలో అమలు చేస్తున్నామన్నారు. డౌట్ ఉంటే మా రాష్ట్రానికి తీసుకెళ్లి దగ్గరుండి మా పథకాల అమలు తీరు చూపిస్తానన్నారు. కారులో వెళ్దామా విమానంలో వెళ్దామా? ఖర్చు అంతా నాదే మీ భద్రత బాధ్యత నాదే అన్నారు. ఒక వేళ అక్కడ మా గ్యారెంటీలు అమలు జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ప్రజలకు ప్రశాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed