బంధువుల ఇళ్లల్లో IT దాడులు.. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు షాకింగ్ కామెంట్స్!

by Rajesh |
బంధువుల ఇళ్లల్లో IT దాడులు.. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ దాడులపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందించారు. తన బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగలేదన్నారు. ఐటీ అధికారులు ఎవరూ తనను కలవలేదన్నారు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. రైస్ మిల్లర్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రైస్ మిల్లర్లతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. కుట్రలో భాగంగానే తనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని భాస్కర్ రావు ఫైర్ అయ్యారు. తనకు ఎలాంటి కంపెనీలు లేవన్నారు. తన దగ్గర డబ్బులు లేవని.. ఎక్కడైనా ఉంటే చూపిస్తే మీకే ఇచ్చేస్తా అన్నారు. ఇక, భాస్కర్ రావు వేముల పల్లిలో ఎన్నికల ప్రచారం‌లో పాల్గొన్నారు.

Next Story

Most Viewed