- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలి..? ఎమ్మెల్యే కోవా లక్ష్మి
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం చిన్నచూపు చూడొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కోరారు. అభివృద్ధి మమ్ములను ముందుకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదని, సీడీపీ నిధులు10కోట్లు కేటాయిస్తే అభివృద్ధి పనులు నియోజకవర్గాల్లో చేసుకుంటామన్నారు. సీఆర్పీలు, ఆశావర్కర్లకు వేతనాలు పెంచాలని, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలన్నారు. అంగన్ వాడీ టీచర్లకు 18వేలు ఇస్తామన్నారని ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు.
మహిళలకు రూ.2500తో పాటు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లక్షతో పాటు తులం బంగారం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. న్యూట్రీషియన్ కిట్, కేసీఆర్ కిట్ ప్రారంభించాలన్నారు. కుమరం భీం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పెండింగ్ పనులతో పాటు కాల్వల పనులు పూర్తి చేయాలని, ఈ ప్రాజెక్టుతో ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్ నగర్, సిర్పూర్ మండలాల్లోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. హుండీ బ్రిడ్జీ సైతం నిర్మించాలని, వట్టి వాగు, చెలిమెల వాగు ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. సమ్మక్క సారక్కతో పాటు జోడేఘాట్‌కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తండాలకు రోడ్లు లేవని వాటికి నిధులు కేటాయించాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.