మా రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నాం.. MLA కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
మా రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నాం.. MLA కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. NTPC నుంచి ఫ్లై యాష్ తరలింపులో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఒకటి కాదు రెండు కాదు.. రోజూ ఏకంగా రూ.90 లక్షల దోపిడీ జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రూ.90 లక్షల దోపిడీలో మంత్రి పొన్నం ప్రభాకర్ వాటా రూ.50 లక్షలు అని అన్నారు. స్వయంగా మంత్రి అన్న కొడుకు అనూప్ ద్వారా వసూళ్లకు పాల్పడ్డారని వెల్లడించారు. 32 టన్నుల లోడ్‌తో వెళ్లాల్సిన లారీలో 76 టన్నుల ఫ్లై యాష్ తరలిస్తున్నారని అన్నారు. రోజుకు 300 లారీల్లో ఫ్లైయాష్ తరలిస్తూ కోట్లలో దోపిడీ చేస్తున్నారని తెలిపారు. తమ వద్ద కూడా రెడ్ బుక్ ఉందని.. ఎవరెవరు ఎంతకు తెగిస్తున్నారో, ఎంత మేర అక్రమాలు చేస్తున్నారో అందరి పేర్లు నమోదు చేస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా టైమ్ వచ్చినప్పుడు మేమేంటో కూడా చూపిస్తాం. అప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed