100 రోజులు కాలే.. వందల కోట్ల స్కామ్‌లు.. అది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్: MLA గువ్వల

by Disha Web Desk 19 |
100 రోజులు కాలే.. వందల కోట్ల స్కామ్‌లు.. అది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్: MLA గువ్వల
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదు.. వందల కోట్ల స్కామ్‌లు బయటపడుతున్నాయని కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అది కాంగ్రెస్ పార్టీ కాదు.. స్కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ రూపకల్పన చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి.. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌ను తప్ప ఎవరిని కోరుకోవడం లేదన్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఆదరణ ఎందుకు లేదని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అప్పుడు సోనియాను బలి దేవత అన్నాడు.. ఇప్పుడేమో దేవత అంటున్నాడని సెటైర్ వేశాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకు లేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ వెయ్యి నుండి 15 వందల లోపు కూడా లేదని ఎద్దేవా చేశారు.


Next Story

Most Viewed