పీఏసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే గాంధీ.. తీవ్రస్థాయిలో మండిపడ్డ హరీశ్ రావు

by Mahesh |
పీఏసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే గాంధీ.. తీవ్రస్థాయిలో మండిపడ్డ హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మూడు కమిటీలు ఏర్పాటు చేస్తూ.. సోమవారం రోజు తెలంగాణ శాసనసభ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పీఏసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్ గా ఎన్. పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా కే. శంకరయ్య, మూడు కమిటీలకు కలిపి..ఒక్కో కమిటీలో 12 మంది చొప్పున సభ్యులను నియమిస్తూ శాసన సభ సెక్రటరీ ఉత్తర్వు జారీ చేశారు. కాగా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీఏసీ పదవి అరికెపూడి గాంధీకి ఇవ్వడం హాస్యాస్పదం అని, పీఏసీ బాధ్యతలు ప్రతిపక్ష నాయకులకు ఇస్తారు కానీ.. బీఆర్ఎన్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడమేంటి అని హరీశ్ రావు ప్రశ్నించారు. కాగా ఈ పీఏసీ పదవి కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్ వేశారు.

Advertisement

Next Story