నామినేషన్ వేసిన స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థి

by Rajesh |
నామినేషన్ వేసిన స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థి
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థి మీర్జా రెహమత్ బేగ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రహమత్ బేగ్ మాట్లాడుతూ నాకు ఇలాంటి అవకాశం కల్పించిన అసదుద్దీన్ ఓవైసీకి ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎంఐఎంలో కొనసాగుతన్నానని తెలిపారు. నా పనిని గుర్తించి నాకు ఇంత పెద్ద పదవి ఇవ్వడం బాధ్యతగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు.

Next Story