Telangana weather update: నీట మునిగిన మంత్రి సొంత గ్రామం (వీడియో)

by Disha Web Desk 4 |
Telangana weather update: నీట మునిగిన మంత్రి సొంత గ్రామం (వీడియో)
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. ఆర్మూర్ - మోర్తాడ్ మధ్య గల లక్కోరా గ్రామంలో రహదారిపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. దానితో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు ప్రవహిస్తుండడంతో మంగళవారం ఉదయం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామం వేల్పూర్ వరద తాకిడికి గురైంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు మొదలైన భారీ వర్షాలకు మసులు గుంట చెరువు కట్ట తెగిపోవడంతో పోలీస్ స్టేషన్, తహసిల్దార్ అఫీస్, పెట్రోల్ బంక్, మైనార్టీ మదర్సా, వీడిసి కాంప్లెక్స్ నీట మునిగిపోయాయి. గ్రామంలో సెంటర్ లైట్ మీడియంపై నుంచి నీరు ప్రవహిస్తుంది. అధికారులు వరద నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

Next Story

Most Viewed